Saturday, 28 March 2020

AMMA ODI

అమ్మఒడి

గర్భిణిలు ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళడంకోసం, ప్రసవానంతరం ఇంటికి చేరడంకోసం ప్రభుత్వం ప్రత్యేక వాహన సదుపాయాన్ని ఏర్పాటుచేసింది. 102 నంబరుకు ఫోన్‌ చేస్తే ప్రత్యేక సదుపాయాలు ఉన్న వాహనం గర్భిణీ ఇంటిముందుకు వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అమ్మఒడి పథకం కోసం 250 వాహనాలు పనిచేస్తున్నాయి. గర్భం దాల్చిన 3 నెలల నుంచి ప్రసవం అయ్యే వరకు చెకప్‌లకు తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావటం, డెలివరీ అయ్యాక తల్లీబిడ్డను ఇంటికి చేరవేయడం, చిన్నారులను టీకాలు వేయడానికి తీసుకురావడం వంటి కార్యక్రమాలు 102 వాహనం ద్వారా నిర్వహిస్తారు.

కె.సి.ఆర్‌. కిట్‌

సురక్షితమైన ప్రసవాల కోసం ప్రభుత్వ ఆస్పత్రులలో చేరేవారికి ప్రభుత్వం కేసీఆర్‌ కిట్లు అందిస్తుంది. గర్భం దాల్చిన నాటినుంచి ప్రసవం జరిగి శిశువుకు 10 నెలల వయసు వచ్చేంతవరకూ నాలుగు విడతలలో అనగా గర్భం దాల్చిన ఐదు నెలలలోపు డాక్టరు పరీక్ష అనంతరం రూ. 3000, ప్రసవ సమయంలో ఆడ శిశువుకు రూ. 5000, లేదా మగ శిశువుకు రూ. 4000, శిశువుకు వ్యాధినిరోధక టీకాలు 14 వారాల వయసులో రూ. 3000,, 10 నెలల వయసులో రు. 2000 చొప్పుననాలుగు విడతలలో రూ. 12,000 రూపాయలను అందిచడంతోపాటు, ఆడిపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా అందిస్తున్నది. ప్రసవం తర్వాత రెండు వేల రూపాయల విలువచేసే 16 రకాల వస్తువులు ఉండే కేసీఆర్‌ కిట్‌ను కూడా ఇస్తుంది.


A source from Wikipedia

No comments:

Post a Comment