ఆరోగ్య లక్ష్మి పథకం
సమీకృత బాలల అభివృద్ధి పథకం (ICDS) కొరకు 1975 నుండి కేంద్రం ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలు ఉమ్మడిగా నడుపుతున్న పథకానికి అనుబంధంగా బాలెంతలకు, గర్భిణిలకు పౌష్టిక ఆహారం అందజేసే తెలంగాణ రాష్ట్రం పథకం పేరు
ఆరోగ్య లక్ష్మి పథకం. ఐసిడ్ఎస్ పథకంలో ఆదాయంతో సంబంధం లేకుండా
లబ్దిదారులందరికీ పౌష్టిక ఆహారం (గర్భిణీలకు, బాలెంతలకు రేషన్ గా)
అందజేయబడుతుండగా, ఈ పథకంలో దారిద్య్రరేఖకు దిగువలో ఉన్న కుటుంబాల
బాలబాలికలకు,మహిళలకు పౌష్టిక ఆహారం భోజనం, రేషన్ రూపంలో అందజేయబడుతున్నది. ఈ పథకం ద్వారా అంగన్వాడి కేంద్రాల నుండి గర్బిణి స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు ప్రతిరోజూ గుడ్లు పాలుతోపాటు మంచి ఆహారం ను ప్రభుత్వం అందిస్తుంది. ఇది ప్రయోగాత్మకంగా 01.01.2013 న ప్రారంభమై, తెలంగాణా ఏర్పడిన తర్వాత విస్తరించబడింది.
ప్రారంభం
రాష్ట్రంలోని తల్లి, బిడ్డలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యం ప్రకటిస్తూ 2015, జనవరి
1న
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభిచబడింది.
[4]
పథకం వివరాలు
- గర్భిణులకు ఇవ్వనున్న గుడ్ల సంఖ్యను 16 నుంచి 30 పెంచడంతోపాటు వారికి ఒకపూట భోజనం అందించడం
- కిషోర బాలికలకు 16 గుడ్లను ఇవ్వడంతోపాటూ బియ్యం, కంది పప్పు, మంచినూనె, ఐరన్ ఫోలిక్ ఆసిడ్ టాబ్లెడ్స్ అందించడం
- 6నెలల నుంచి 6ఏండ్ల వయసున్న బాలబాలికలకు 2.5 కిలోల
బాలామృతం (తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ సరఫరా చేసే విటమినైజ్‌డ్ స్నాక్స్),
ప్రతినెల 6 నెలల నుంచి 3 ఏండ్ల వయసున్న బాలబాలికలకు 16 గుడ్లను, 3 నుంచి 6
ఏండ్ల వయసున్న వారికి 30 గుడ్లను ప్రతినెలా అందించడం
No comments:
Post a Comment