పాస్‌పోర్ట్ సులభంగా పొందడం ఎలా?
ఇది వరకు పాస్‌పోర్ట్ కోసం కచ్చితంగా పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఇ-అప్లికేషన్ పేరుతో కొత్త ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఆన్‌లైన్‌లోనే పాస్‌పోర్ట్ అప్లికేషన్‌ను ఫిల్ చేసి, సబ్‌మిట్ చేయవచ్చు. అలాగే అపాయింట్‌మెంట్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు.
పాస్పోర్ట్ అప్లికేషన్ కోసం కావలసినవి
- ఆధార్ కార్డు డేట్ అఫ్ బర్త్
- డ్రైవింగ్ లైసెన్స్
- ఓటర్ ఐడి కార్డ్
- పాన్ కార్డు
- టెన్త్ మెమో
పాస్పోర్ట్ అపాయింట్మెంట్ ప్లస్ అప్లికేషన్ కోసం కామన్ సర్వీస్ సెంటర్ కేంద్రాన్ని సంప్రదించగలరు లేదా మీరు సొంతగా చేయాలనుకుంటే కింద ప్రొసీజర్ ఫాలో అవ్వండి
పాస్‌పోర్ట్ కోసం పాస్‌పోర్ట్ సేవా కేంద్ర (పీఎస్‌కే) ఆన్‌లైన్ పోర్టల్‌లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. వెబ్‌సైట్‌లోని రిజిస్టర్ నౌ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీకు ఒక రిజిస్ట్రేషన్ లాగిన్ ఐడీ వస్తుంది. దాని సాయంతో తర్వాత పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వొచ్చు.
తర్వాత అప్లై ఫర్ ఫ్రెష్ పాస్ట్‌పోర్ట్/రీఇష్యూ ఆఫ్ పాస్‌పోర్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ పాస్‌పోర్ట్ అప్లికేషన్‌ను వ్యక్తిగత సమాచారంతో నింపాల్సి ఉంటుంది. అప్లికేషన్ నింపిన తర్వాత పే అండ్ షెడ్యూల్ అపాయింట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
బుకింగ్ అపాయింట్‌మెంట్ కోసం కచ్చితంగా ఆన్‌లైన్ పేమెంట్ చేయాలి. తర్వాతనే పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు లేదా పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో అపాయింట్‌మెంట్ లభిస్తుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి మార్గాల్లో డబ్బులు చెల్లించొచ్చు.
డబ్బులు చెల్లించిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్‌పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ రిసిప్ట్ ప్రింట్ తీసుకోవాలి. దీనిపై అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ లేదా అపాయింట్‌మెంట్ నెంబర్ ఉంటుంది. తర్వాత మీరు ఎక్కడైతే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోన్నారో ఆ పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు వెళ్లాలి. ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి.
No comments:
Post a Comment