పీఎంకిసాన్ మంధాన్ యోజన(PMKMY)
or
పీఎం స్రంయోగ్ మాంధాన్ యోజన(PMSYMY)
రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్.. రిజిస్ట్రేషన్స్ ప్రారంభం!
- పీఎం-కేఎంవై స్కీమ్ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం
- 2 హెక్టార్లలోపు భూమి కలిగిన రైతులు ఈ స్కీమ్‌లో చేరొచ్చు
- భార్యభర్తలిద్దరికీ పథకంలో చేరే అవకాశం
- కామన్ సర్వీస్ సెంటర్లలో నమోదు చేసుకోవచ్చు
‘దేశవ్యాప్తంగా పీఎం-కేఎంవై రిజిస్ట్రేషన్ ప్రక్రియ
ప్రారంభమైంది. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని వ్యవసాయ
శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. జమ్మూ అండ్ కశ్మీర్ సహా
దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.
‘ఎంత కష్టపడుతున్నా కూడా రైతులకు సరైన ఆదాయం లభించడం లేదు. అందువల్ల వారి సామాజిక భత్రతా చాలా ముఖ్యం. అన్నదాత ఆదాయం పెంపునకు పలు చర్యలు తీసుకున్నాం. పీఎం-కేఎంవై కూడా ఇందులో ఒక భాగమే’ అని తోమర్ తెలిపారు.
2 హెక్టార్ల వరకు భూమి కలిగిన రైతులు ఈ పథకానికి అర్హలు. ఇది వాలంటరీ క్రంటిబ్యూషన్ ఆధారిత పెన్షన్ స్కీమ్. 18 నుంచి 40 ఏళ్లలోపు వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్‌సీ) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. వయసు ప్రాతిపదికన చెల్లించే మొత్తం మారుతుంది. రైతులు చెల్లించే మొత్తానికి సమాన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పెన్షన్ ఫండ్‌కు చెల్లిస్తుంది. భర్యభర్తలిద్దరూ విడివిడిగా చెల్లించి విడివిడిగా పెన్షన్ పొందొచ్చు.
స్కీమ్‌లో చేరినవారు రిటైర్మెంట్‌కు ముందుగానే మరణిస్తే చెల్లించిన మొత్తాన్ని వడ్డీతోపాటు తిరిగి చెల్లిస్తారు. నామినీకి ఈ మొత్తం అందుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పెన్షన్ ఫండ్‌ను నిర్వహిస్తుంది.
No comments:
Post a Comment