CIBIL Score (Credit Score) అంటే ఏమిటి?
What is CIBIL Score or Credit Score:
మనకు అత్యవసర సమయంలో ఋణం(Loan) కావలసినపుడు మనం బ్యాంకులను ఆశ్రయిస్తూ ఉంటాం. ఆ సమయంలో బ్యాంకు వాళ్ళు ముందుగా మన సిబిల్ స్కోర్(CIBIL Score) లేదా క్రెడిట్ స్కోర్(Credit Score) ని చెక్ చేస్తారు. ఒకవేళ మన సిబిల్ స్కోర్ బాగుంటే మనకు లోన్ ఇస్తారు. లేకపోతే లోన్ ఇవ్వకపోవచ్చు. దాదాపుగా ఏ బ్యాంకు అయినా ఈ CIBIL Score ఆధారంగానే లోన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనమందరం ఈ సిబిల్ స్కోర్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది . కాబట్టి ఈ Credit Score గురించి వివరంగా తెలుసుకుందాం.
సిబిల్ స్కోర్(CIBIL Score) అనేది Credit Information Bureau India Limited (CIBIL) వారిచే ఇవ్వబడే మూడంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు వాటికి సంబంధిచిన చెల్లింపుల వివరాలను పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా సిబిల్ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సిబిల్ డిపార్ట్ మెంట్ వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరికి సంబందించిన రుణాలు వాటి చెల్లింపులు వివరాలు అన్ని ఉంటాయి. ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు? తీసుకున్న లోన్ ని తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా? అతనికి సంబందించిన క్రెడిట్ కార్డు(Credit Card) వాటిలోని లావాదేవీలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని అతనికి ఒక స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 300 నుండి 900 మధ్యలో ఉంటుంది. మన సిబిల్ స్కోర్ అనేది 900 కి దగ్గరగా ఉంటే మంచిది అంటే ఎంత ఎక్కువగా ఉంటె అంత మంచిదన్నమాట . ఈ స్కోర్ అనేది 750 కి పైగా ఉంటె ఆ వ్యక్తి Credit Score బాగుందని అర్ధం.
క్రెడిట్ స్కోర్(Credit Score) ఎక్కువగా ఉండడం వలన ఉపయోగలేమిటి?
ఒకవేళ మీరు రుణం కోసం బ్యాంకు కి వెళ్తే ముందు వాళ్ళు చెక్ చేసిది సిబిల్ స్కోర్ నే. మీ సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటె మీరు త్వరగా ఋణం(Loan) పొందే అవకాశం ఉంది. మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటె ఋణం రాదని కాదు. ఒక బ్యాంకులో లోన్ ఇవ్వకయినా మరొక బ్యాంకు లోన్ ఇవ్వవచ్చు . అది ఆయా బ్యాంకుల పాలసీ(Bank Policies) ల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అతనకి ఏదైనా బ్యాంకు అప్పు ఇచ్చిన ఎక్కువ వడ్డీ రేట్ (Interest Rate )తో లోన్ ఇస్తుంది. అంటే అతను ఎక్కువ వడ్డీ చెల్లించవలసి ఉంటుంది.
Excellent Score (750 – 900): మీ సిబిల్ స్కోర్ 750 నుండి 900 మధ్యలో ఉంటే మీరు ఎటువంటి లోన్ అయినా సులభంగా పొందవచ్చు. అదీ కూడా తక్కువ వడ్డీ రేట్ తో పొందవచ్చు.
Good Score (700-749): మీ స్కోర్ 700 నుండి 749 మధ్యలో ఉంటే మీరు ఎటువంటి లోన్ అయినా పొందుతారు. కానీ మీరు ఎక్కువ వడ్డీ చెల్లించవలసి ఉంటుంది.
Fair (650-699): ఒకవేళ మీ స్కోర్ 650 నుండి 699 మధ్యలో ఉంటే Secured loans పొందగలరు. అంటే కారు లేదా ఇల్లు వంటి వాటి కోసం తీసుకునే లోన్ పొందగలరు. కానీ Unsecured loan పొందలేరు. అంటే వ్యక్తిగత అవసరాల కోసం, చదువు కోసం తీసుకునే లోన్ లు, క్రెడిట్ కార్డు మీద లోన్ లు పొందలేరు.
Low (below 550): ఒకవేళ మీ స్కోర్ 550 కన్నా తక్కువగా ఉంటే ఆ సమయంలో బ్యాంకులు మీకు లోన్ ఇవ్వడానికి అంతగా మొగ్గు చూపవు. మీ ఏ బ్యాంకు నుండి అయినా లోన్ పొందడం చాల కష్టం అవుతుంది.
మీ సిబిల్ స్కోర్ (CIBIL Score) తెలుసుకోవడం ఎలా?
కామన్ సర్వీసెస్ కేంద్రాల ద్వారా మీయొక్క CIBIL SCORE తెలుసుకోవచ్చు కాల్: 9652113030
ఒకవేళ మీరు మీ క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే సిబిల్ స్కోర్ కోసం అప్లై చేసుకోవలసి ఉంటుంది. దానికోసం మీరు CIBIL కి సంబందించిన అధికారక వెబ్ సైట్ కి వెళ్ళండి : www.cibil.com
1. ముందుగా ఆన్ లైన్ లో ఫారం పూర్తి చెయ్యాలి.
2. మీ పాన్ కార్డు, బ్యాంకుకు సంబందించిన వివరాలను పూర్తి చెయ్యాలి.
3. మీరు మీ సిబిల్ స్కోర్ తెలుసుకోవాలనుకుంటే మీరు కొంత ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
4. ఆ తరువాత క్రెడిట్ రిపోర్ట్ అనేది మీకు ఈ మెయిల్ ద్వారా పంపబడుతుంది.
సిబిల్ స్కోర్(CIBIL Score) మీద ప్రభావం చూపే అంశాలు:
1.మనం బ్యాంకుల నుండి ఋణం తీసుకుని వాటి చెల్లింపులు ఆలస్యం చేస్తే స్కోర్ తగ్గుతుంది . కాబట్టి బ్యాంకు లోన్స్ లేదా క్రెడిట్ కార్డు బిల్ ని ఎప్పటికప్పడు డ్యూ డేట్ లోపు పే చెయ్యడం మంచిది.
2.Unsecured loans అంటే చదువు , వ్యక్తి గత అవసరాల కోసం తీసుకున్న రుణాలు ఎక్కువగా ఉంటె క్రెడిట్ స్కోర్ (Credit Score) తగ్గుతుంది.
3. Secured loans అంటే ఇళ్లు, వాహనాల కోసం రుణాలు తీసుకున్నట్లైతే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది .
4. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ లోన్ లు తీసుకున్న స్కోర్ తగ్గుతుంది.
కాబట్టి ఇప్పటి నుండి క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ ని కూడా దృష్టిలో పెట్టుకోండి. సిబిల్ స్కోర్ ని పెంచుకుని, ఆ స్కోర్ 750 పైనే ఉండేలా చూసుకోండి. Thank You
No comments:
Post a Comment