షాదీ ముబారక్ పథకం
షాదీ ముబారక్ పథకం తెలంగాణ రాష్ట్రం లోని ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన యువతుల వివాహాల కోసం రూ. 1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకం. 2017, మార్చి 13న ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్ లో ఈ పథక ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుండి రూ.75,116 లకు పెంచారు. 2018, మార్చి 19న రూ.1,00,116 కు పెంచారు.ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అక్టోబరు 2, 2014 నుంచి ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. 18ఏళ్లు వయోపరిమితి ఉన్న ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన యువతులకు ఈ పథకం వర్తిస్తుంది. గ్రామాల్లో ఆదాయం రూ.లక్షన్నర, పట్టణాల్లో రూ.2 లక్షల ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు.నియమాలు - అర్హతలు
- అర్హులైన యువతులు తమ వివాహానికి నెల రోజుల ముందు మీ-సేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోవాలి
- ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన యువతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు
- ధరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. వారి కుటుంబ సభ్యుల ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు
- వివాహ సమయానికి అమ్మాయి వయసు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి
- బ్యాంకు ఖాతా పుస్తకం (వధువు పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న బ్యాంకు ఖాతా పుస్తకంపై వధువు ఫొటో తప్పనిసరిగా ఉండాలి)
కావలసిన ధ్రువపత్రాలు
- పుట్టిన తేదీ ధృవపత్రం (మీసేవ ద్వారా సంబంధిత అధికారులు జారీ చేసినది)
- కులం ధృవీకరణ పత్రం (మీసేవ ద్వారా సంబంధిత అధికారులు జారీ చేసినది)
- ఆదాయ ధృవీవకరణ పత్రం (వివాహం జరుగు తేదీ నాటికి 6 నెలలలోపు మీ-సేవ ద్వారా సంబంధిత అధికారిచేత జారీ చేసినది)
- పెళ్లికూతురు, పెళ్ళికుమారుడికి చెందిన ఇద్దరి ఆధార్ కార్డులు
- బ్యాంకు ఖాతా పుస్తకం (వధువు పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న బ్యాంకు ఖాతా పుస్తకంపై వధువు ఫొటో తప్పనిసరిగా ఉండాలి)
- వివాహ ఆహ్వాన పత్రిక
- వివాహం జరిపించిన గ్రామ పంచాయతీ/చర్చి /మసీదు/ ఏ ఇతర అధికారిక సంస్థ ద్వారా అందిన ఉత్తరం
ధరఖాస్తు విధానం
తెలంగాణ ఈపాస్లో ధరఖాస్తు చేసుకోవాలి. పెళ్ళికి 10 రోజుల ముందు ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.A SOURCE FROM WIKIKEDIA
No comments:
Post a Comment